మక్కపేట చారిత్రక నేపధ్యం
కృష్ణా జిల్లా ,జగ్గయ్యపేట సమీపంలో గల తిరుమలగిరికి ఈశాన్యంగా గల మక్కపేట గ్రామం చాల పురాతనమైనదిగా హిందూ ,మహమ్మదీయుల సంస్కృతుల సమైక్య నిలయంగా విలసిల్లి ,కాలగమనంలో చితికి ,జీర్ణమై ,అనేక శిధిలావాశేషాలతో బహుదేవాలయాలతో ప్రస్తుతము మనకుకనిపిస్తున్నది .కొన్ని వందల యేండ్లనాటి శిలావిగ్రహాలు అనాటి మానవుల సామజిక సాంస్కృతిక చిహ్నాలుగా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి .
చరిత్రగతిలో కలిసిపోయి ,అంతర్దానమైన దేవరాబాదు ,హస్నాబాదు అనే పేర్లతో ఈ నాటికీ పిలవబడుతున్న ప్రదేశాలు ఒకనాటి చారిత్రక విశేషాలతో వర్దిల్లి ,దండుబాట అనే రహదారి పక్కన నాటి రాజకీయ,సామజిక వ్యవహారాల కూడలి స్థానాలుగా నిలిచి క్రమంగాపతనమైనట్లు ఈ శిధిలావాశేషాలు సాక్షీభూతంగా నిలిచి ఉన్నాయి .
ప్రస్తుతం ఉన్న మక్కపేట గ్రామం పాడుబడిన కోట బురుజుల దిబ్బలతో నిండి ,పాటిమట్టి నిక్షేపాలతో నుండి ,ఇండ్ల పునాదులకు కందకాలు త్రవ్విన చాల సందర్భములలో దొరుకుతున్న పురాతన సంపదయే మనకు అలనాటి వైభవాన్ని రుజువు చేస్తున్నది .
1983 లో అజ్మీరు వెంకటప్పయ్య యిండ్ల స్థలంలో ఇంటి పునాదులకు కందకాలు త్రవ్వుచున్నప్పుదు దొరికిన పాత్రలు ,వివిధరకాల సామాగ్రి ,వస్తువులు షుమారుగా 80కిలోల కంచువి,12 కిలోల రాగివి జగ్గయ్యపేట తాహసీల్దారు గారి ద్వారా ప్రభుత్వానికి అప్పగించిన శిధిల పాత్రలే మనకు నిదర్శనం .ఈ విషయం ఆనాటి జిల్లా కలెక్టర్ వారి గెజిట్ లో కూడా ప్రకటించడ మైనది
ఈ మక్కపేట గ్రామం వేంగీచాళుక్య భూపతుల కాలంలో నిర్మించబడి ,సువిశాలమైన ప్రాంతానికి విస్తరించబడి చాళుక్య ప్రభువులకు మజిలి కేంద్రంగా తప్పక అయి ఉండవచ్చు .
తూర్పు చాళు క్యులలొ వేంగీ రాజ్యము కొరకు రెండవ విజయాదిత్యుడు తన తమ్ముడైన చాళుక్య భీమునితో పోరాడి విజయం సాధించి ,వేంగీ సింహాసన మధిష్టిoచెను. రాష్ట్ర కూటులను ,పశ్చిమగంగులను ఓడించి ,పన్నెండు సంవత్సరములు ఘోర సంగ్రమమోనర్చి వేంగీ రాజ్యమును విస్తరింపజేసి " నరేంద్ర మృగరాజుగా ఆనాడు జనులితనిని కొనియాడిరి .
ఇతను పరమ శైవుడు .క్రీ . శ . 806 -846 వరకు ఇతని పరిపాలనా కాలంలో తను జేసినా శత్రు సంహారము ,జన్మ నష్టమునకు పాప పరిహారంగా 108 శివాలయములను స్తాపించినట్టు అoదు మక్కపేట లో గల కాశీ విశ్వనాధాలయంగా చెప్పబడుతున్న శివాలయం కూడా ఆ 108 లో ఒకటికావచ్చునని పురావస్తు పరిశోధకుల అభిప్రాయం .
ఇతను పరమ శైవుడు .క్రీ . శ . 806 -846 వరకు ఇతని పరిపాలనా కాలంలో తను జేసినా శత్రు సంహారము ,జన్మ నష్టమునకు పాప పరిహారంగా 108 శివాలయములను స్తాపించినట్టు అoదు మక్కపేట లో గల కాశీ విశ్వనాధాలయంగా చెప్పబడుతున్న శివాలయం కూడా ఆ 108 లో ఒకటికావచ్చునని పురావస్తు పరిశోధకుల అభిప్రాయం .
విశ్వనాథ చోళుడు అను రాజు మక్కపేట శివాలయమునకు భూదానమోనర్చనని అందులకు కృతజ్ఞతగా ఈ శివాలయమునకు "కాశీవిశ్వనాధాలయముగ "నామకరణం చేసినట్లుగా తెలుయుచున్నది . మనదేశం లో దేవాలయములు స్తాపించినా ,లేక భూదానములిచ్చినా వారి పేర్లతో అయా దేవాలయములను పిలుచుట చాలా సందర్భములలో గలదు .
త్యాగి వారు నందిగామ సీమను పాలించు కాలము నాటికే ఆంధ్రదేశంలో ఢిల్లీ సుల్తానుల ప్రాబల్యము ఏర్పడి క్రమంగా నిలద్రొక్కుకొని విస్తరించుచున్నది . బరిహత్ కల్లాచిపురం (పెనుగంచిప్రోలు ) హస్నాబాద్ ,మక్కపేట మొదలగు గ్రామములు సుల్తానుల ఏలుబడిలో నిలిచి ముస్లిముల పుణ్య క్షేత్రం "మక్కా "గా "మక్కపేట" సుల్తానుల సాంస్కృతిక నిలయంగా నున్నట్లు తెలుయుచున్నది .
సాగి పోతరాజు ముక్త్యాలయందు ముక్తేశ్వర మహాదేవాలయం నిర్మించి ,సింహగిరి (సింహాచలం) నరసింహస్వామికిసాగిపోత సముద్రంబను చెరువు కట్టించినట్లుగా ,శ్రీ పర్వతమున (శ్రీశైలం) మల్లికార్జుని ముందుట నందికేశ్వరుని ప్రతిష్టించి అచ్చట దేవబోగంబులను కంభంపాడు ,ముచ్చింతాల ,బూదవాడ గ్రామములనిచ్చి బ్రాహ్మణులకు అనేక అగ్రహరములను నిచ్చినట్లు బెజవాడ మల్లేశ్వరస్వామి దేవాలయమున గల శాసనముల ద్వారా తెలుయుచున్నది .
చందవోలు రాజునకు ,మక్కపేట హస్నాబాద్ ,దేవరాబాద్ లను పాలించుచున్న ముస్లిములకు బరిహత్కల్లాచిపురం (పెనుగంచిప్రోలు ) వద్దగల మున్నేటి తీరాన గొప్ప యుద్ధము జరిగినట్లుగా తెలియుచున్నది . కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని అస్తానకవియు ,ప్రతాపరుద్ర యశోభూషణము వ్రాసిన విశ్వనాథ కవి దండు బాటలో ప్రయాణం చేస్తూ మక్కపేటలోని శివాలయం పిలువుచున్న "శ్రీ కాశీ విశ్వనాథ " ఆలయంలో ఒక రాత్రి విశ్రమించినట్లునూ ,ఇది తెలిసిన మక్కపేట , దేవరాబాద్ లోని బ్రాహ్మణులు వచ్చి విశ్వనాధుని దర్శించి పరామర్సాలతో అతిధి మర్యాదలొనర్చగా అందుకు ప్రతిఫలంగా అనేక ధన ,కనకరత్న ,వజ్ర వైడుర్యాలను కాక అగ్రహారాలను కూడా అ బ్రాహ్మణులకు ఇచ్చినట్లు ఒక యైతిహ్యము కలదు.
కొందరు మక్కన్న ,రామన్న ,అచ్చన్న అను పేరుగల అన్నదమ్ములు నిర్మించిన మూడు గ్రామములకు మక్కపేట,రామన్నపేట, అచ్చంపేట అను నామకరణం ఏర్పడినట్లు ఒక జనశ్రుతి గలదు.
కాలక్రమంలో దేవరాబాదు , హస్నాబాదు అను గ్రామములు రాజుల దండయాత్రలు ,బందిపోట్ల దోపిడీలకు తట్టుకోలేక నిర్మానుష్యంగా జనజీవనం పూర్తిగా లేకపోయి నందున అంతరించినట్లుగా కనిపిస్తుంది .
మక్కాగా మహమ్మదీయులు ,మక్కపేటగా హిందువులు సమైక్యంగా పురాతనకాలం నుండి మత సామరస్యాన్ని చాటుతున్న ప్రసిద్ధ ప్రదేశంగా హిందువుల దేవాలయాలేకాక ముస్లిముల ప్రార్ధనాలయాలైన మస్జిద్లతో మక్కపేట వర్దిల్లినట్లుగా గ్రామంలో అక్కడక్కడ కనిపిస్తున్న శిధిల శిలాఫలకములు చెప్పుచున్నవి .
మక్కపేట గ్రామంలోని ప్రధాన ఆలయాలు
1. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం
2. శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం
3. శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం
4. శ్రీ కోదండ రామస్వామి ఆలయం
5.శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం
6. శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం
శ్రీ కాశీవిశ్వనాధాలయం
ఈ ఆలయం ప్రస్తుతం మక్కపేట గ్రామానికి ఈశాన్యంగా దండుబాట రహదారికి ,ప్రస్తుతం భద్రాచలం - జగ్గయ్యపేట రోడ్డు ప్రక్కన ఉన్నది . ఇది 11వ శతాబ్ధం లో వేంగీ చాళుక్యులలో రెండవ విజదిత్యుడు శివలింగాన్ని ప్రతిస్తిన్చినట్టు ఇక్కడి ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఈ ఆలయం ఎదురుగా ధ్వజస్థంబానికి ముందు సూర్యుడి శిలాప్రతిమను ప్రతిష్టించారు . ఉత్తరం వైపు నుండి వరుసగా నాగేంద్ర స్వామి ,కాలభైరవుడు ,సరస్వతి అమ్మవారు ,దత్తాత్రేయ స్వామివారు,శిలా ప్రతిమలు ఉన్నాయి . దక్షిణం వైపున సప్తమాతృకలు ప్రతిమలు చెక్కిన ఏక శిలా ప్రతిమ ఉన్నది . ఈ ఆలయాన్ని వెలనాటి చోళుల కాలంలో విశ్వనాథ చోళుడు సందర్శించి ఆలయానికి కొంత భూమిని దానం ఇచ్చారు . అంతర్భాగంలో వీరభద్ర స్వామిని 13వ శాతాబ్దం లో ప్రతిష్టించారు .
ఈ ఆలయం నిర్మాణానికి సబందించి చారిత్రక ఆధారాలు పూర్తిగా లభ్యం కాలేదు . కానీ ఈ ప్రాంతంలో శైవ ,వైష్ణవమతముల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి .శైవ మతం బాగా అభివృద్దిలో ఉన్న 15వ శతాబ్ధం లో అక్కడక్కడ వైష్ణవాలయాలు కూడా వెలిసాయి. అదే సమయం లో ఈ ఆలయ నిర్మాణం కూడా జరిగి వుంటుంది .
కాకతీయుల పాలనాకాలంలో ఈ ప్రాంతం లో శైవ మతం బాగా అభివృద్ధి చెందింది . రెండవ బేతవోలు కాలంలో ఆ ప్రాంతంలో బెతవోలును అభివృద్ధి చేసినట్టు తెలుస్తునది . ఆయనే ఉమా మహేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేసి వారి ఇలవేల్పు వీరభద్రస్వామిని ఈ ఆలయానికి ఈశాన్యంగా సుమారు 300 గజాల దూరం లో ప్రతిష్టించారు . వీరభద్రుడికి ఆలయ నిర్మాణం చేయకుండా కాకతీయుల రాజ్య రక్షణతోపాటు మక్కపేట గ్రామానికి ,శైవ క్షేత్రాల సంరక్షణకు క్షేత్రపలకునిగా ప్రతిష్టించారు . ఈ వీరభద్రస్వామి శిలాప్రతిమ ప్రస్తుతం ముక్త్యాలమ్మ వారి ఆలయానికి సమీపం లో ఉన్నది .
ఈ ఆలయం 1903లో ఇదే గ్రామానికి చెందిన గ్రామకరణం గారైన కొమరగిరి పిచ్చియ్య శర్మ గారు నిర్మాణం జరిపినట్లు ఈ దేవాలయం పై ఉన్న శాసనం ద్వారా తెలుస్తునది .
శ్రీ కోదండరామ స్వామి ఆలయం
17వ శతాబ్దం లో ఆంధ్రదేశంలో భక్తి ఉద్యమం ప్రారంభమైంది . మహమ్మదీయులు మత ప్రభావం తగ్గి హిందూ మతానికి తిరిగి ఆదరణ ప్రారంభమైంది . త్యాగయ్య ,భక్తరామదాసు వంటి వారు వైష్ణవ భక్తి తత్వాన్ని ప్రచారం చేస్తున్నారు . మరాఠా ప్రాంతం నుండి భక్తతుకారం వంటి వారు భక్తీ గేయ సాహిత్యంలో సామాన్యులలో వైష్ణవ భక్తిని భోదిస్తున్నారు . ఆ సమయంలోనే అమరావతి జమీoదారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కోదండ రామాలయాన్ని నిర్మించి ,ధూప ,దీపనైవేద్యాదుల కోసం కొంత భూమిని ఇచ్చినట్లు రెవిన్యూ రికార్డుల ఆధారంగా తెలుస్తున్నది .
ఇప్పటికి సుమారు 100 యేండ్ల క్రిందట ప్రస్తుత ఆంజనేయాలయం ఉన్న చోట స్వామి విగ్రహం ఎటువంటి ఆచ్చాదన లేకుండా ఉండటంతో గ్రామం లోని రైతు కుటుంబానికి చెందిన మల్లెల వీరయ్య గారు ఆలయం నిర్మించినట్లు కొందరు చెప్పుచున్నారు .పురాతనoగా ఉన్న దేవాలయాన్ని దొడ్డపనేని శ్రీనివాసరావు గారు మరియు కొంతమంది దాతల సహాయంతో నూతనంగా అభివృద్ది చేశారు.
స్వాతంత్రోద్యమం జరుగుతున్నా రోజులలో మక్కపేట లో ఆనాటి ప్రజలు విరివిగా పాల్గొన్నారు . అందుకు మక్కపేట కరణంగా పని చేసిన కీ . శే కొమరగిరి శేషగిరిరావు గారే ప్రత్యక్ష నిదర్సనం . ఆనాడు భారతదేశం లో నిజాం విలీనానికి ఎంతగానో సహకరించినది . నిజాం ప్రభువుల వల్ల బాదితులైన ఎంతోమందిని అక్కున చేర్చుకొని ఆదరించినది .
స్వాతంత్రోద్యమం లో భాగంగా ఖద్దరు నిధి కోసం 8-4-1929 న మహాత్మాగాంధీ మక్కపేట వచ్చినపుడు జాతినుద్దేశించి నేటి గాంధీజీ కళా వేదికగా పిలవబడుతున్న చౌదరాయి మీది ఉపన్యసించారు .






.jpg)

haribabu:-its good sir..
ReplyDelete